jc diwakar reddy: టీడీపీ, బీజేపీ పొత్తుపై దివాకర్ రెడ్డి జోస్యం

  • పొత్తు కొనసాగుతుంది
  • చంద్రబాబు కార్యసాధకుడు
  • కేంద్రం నుంచి అన్నీ సాధించుకుంటారు

తెలుగుదేశం, బీజేపీ పార్టీల మధ్య పొత్తుపై అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. ఇరు పార్టీల మధ్య ఉన్న పొత్తు, రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యసాధకుడని కితాబిచ్చారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినవన్నీ ఆయన సాధించుకుంటారని చెప్పారు. 2019 ఎన్నికల్లో కూడా టీడీపీనే విజయం సాధిస్తుందని అన్నారు. మిడిమిడి జ్ఞానంతో కొంతమంది టీడీపీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని, అది సరైన పద్ధతి కాదని బీజేపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

jc diwakar reddy
Chandrababu
  • Loading...

More Telugu News