Chandrababu: చంద్రబాబుకి ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి బహిరంగ లేఖ
- పోలవరం కాంట్రాక్టర్లను మీ ఇష్టానుసారం మార్చేందుకు ప్రయత్నించారు
- పోలవరం వ్యయం 16,010 కోట్ల నుంచి 58, 319 కోట్లకు పెంచేశారు
- అందుకే వాటిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు
- అందుకే, తిప్పిపంపింది, అవునా? కాదా?
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని తాము చేసిన పాదయాత్ర, సామూహిక సత్యాగ్రహంపై టీడీపీ నేతలు దుష్ప్రచారం చేయడం అనైతికమంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి బహిరంగ లేఖ రాశారు. తాము పాదయాత్ర సందర్భంగా కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు వరం అని నమ్మిన ప్రజలంతా రాజకీయాలకు అతీతంగా తమ పాదయాత్రలో భాగస్వాములయ్యారని చెప్పారు. ఇది సహించలేని టీడీపీ నేతలు మాత్రం అసహనానికి గురయ్యారని తెలిపారు.
తాము అడుగుతోన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 'పోలవరం కాంట్రాక్టర్లను మీ ఇష్టానుసారం మార్చేందుకు ప్రయత్నిస్తే కేంద్ర ప్రభుత్వం నిలువరించింది అవునా? కాదా ?' అని అడిగారు. పోలవరం వ్యయం 16,010 కోట్ల నుంచి 58, 319 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచేసిన లెక్కలు కేంద్ర జలవనరుల సంఘం నిబంధనలకు అనుగుణంగా జరగలేదని, అందుకే వాటిని ఆమోదించలేదని, కేంద్ర ప్రభుత్వం తిప్పిపంపింది అవునా? కాదా? అని ప్రశ్నించారు.