thota narsimham: జన్మభూమి ముగింపు వేడుకల్లో కోడి పందేలు ఆడిన ఎంపీ, ఎమ్మెల్యే

  • కోడి పందేలు ఆడిన తోట నర్సింహం, వర్మ
  • ప్రజా ప్రతినిధుల చర్యపై విమర్శలు 
  • కత్తులు కట్టలేదంటున్న అనుచరులు 

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మభూమి ముగింపు సందర్భంగా సంప్రదాయబద్ధంగా కోడిపందేలు ఆడారు. ఈ వేడుకల్లో కాకినాడ ఎంపీ తోట నర్సింహం, పిఠాపురం ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు. ఇద్దరూ చెరొక పుంజును రంగంలోకి దించి సరదాగా ఆడారు. కోడిపందేలపై హైకోర్టు ఆంక్షలు విధించినప్పటికీ ప్రజాప్రతినిధులు కోడి పందేలు ఆడటం వివాదాస్పదం అయింది.

ప్రజాప్రతినిధులే కోడి పందేలను ఆడటంతో... దీని ప్రభావం సామాన్యులపై కూడా పడుతుందని అంటున్నారు. అయితే, ప్రజాప్రతినిధులు ఇద్దరూ కోళ్లకు కత్తులు కట్టకుండానే పందెం ఆడారని... కోర్టు కూడా కోళ్లకు కత్తులు కట్టకూడదనే చెప్పిందని వారి అనుచరులు చెబుతున్నారు.

thota narsimham
mla varma
kodi pandelu
  • Loading...

More Telugu News