Pawan Kalyan: కాపు కులస్తుల్లో పవన్ కల్యాణ్ కంటే ముద్రగడే గొప్పవాడు: వీహెచ్

  • చిరంజీవి తమ్ముడిగానే పవన్ నాకు తెలుసు
  • కాపుల్లో ముద్రగడకే ఎక్కువ ప్రజాకర్షణ
  • పవన్ తో నాకు పోటీ లేదు

మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి హయాంలోనే కాపులకు రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమం జరిగిందని వీహెచ్ అన్నారు. అప్పుడు పవన్ కల్యాణ్ ఎవరో కూడా ఎవరికీ తెలియదని ఆయన తెలిపారు. కాపు ఉద్యమంలో అప్పటి నుంచే ముద్రగడ పద్మనాభం ఉన్నారని, ఇప్పుడు కొత్తగా ఆయన రాలేదని చెప్పారు. పవన్ కల్యాణ్ తనకు చిరంజీవి తమ్ముడిగానే తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాపుల్లో పవన్ కల్యాణ్ కంటే ముద్రగడే ఎక్కువ జనాకర్షణ కలిగిన నేత అని చెప్పారు. గతంలో ఎన్నో చెప్పిన పవన్... పెద్ద ఎత్తున కాపు ఉద్యమం జరుగుతున్నప్పుడు మాత్రం ముందుకు రాలేదని విమర్శించారు. మోదీ, చంద్రబాబులకు ఆయన సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు. టీడీపీ అధికారంలోకి రావడానికి పవన్ కల్యాణే కారణమని... అయినా, చంద్రబాబుపై ఆయన ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని అన్నారు. తనకు పవన్ తో పోటీ పడాల్సిన అవసరం లేదని చెప్పారు.

Pawan Kalyan
v hanumantha rao
mudragada padmanabham
kapu reservations
  • Loading...

More Telugu News