pradeep: ప్ర‌దీప్‌ తండ్రి విన‌తితో కోర్టుకు హాజ‌ర‌య్యేందుకు మంగ‌ళ‌వారం వ‌ర‌కు స‌మ‌య‌మిచ్చిన పోలీసులు!

  • పోలీసు ఉన్న‌తాధికారుల‌ను క‌లిసిన ప్ర‌దీప్ తండ్రి
  • పండ‌గ దృష్ట్యా కొంత స‌మ‌యం ఇవ్వాల‌ని విన‌తి
  • కోర్టుకు హాజ‌రు కావ‌డానికి రోజుకో సాకు చెబుతున్న ప్ర‌దీప్‌

మద్యం తాగి కారు న‌డిపి, పోలీసుల‌కు ప‌ట్టుబ‌డిన కేసులో కోర్టుకు హాజ‌ర‌వ‌డంపై యాంక‌ర్ ప్ర‌దీప్ రోజుకో సాకు చెబుతున్నాడు. ఇవాళ కొత్తగా ఆయ‌న తండ్రి రంగంలోకి దిగాడు. సంక్రాంతి పండ‌గ దృష్ట్యా ప్ర‌దీప్ కోర్టుకి హాజ‌రు కాలేడ‌ని, అందుకు గాను ఇంకొంత స‌మ‌యం ఇవ్వాలని కోరుతూ ఆయ‌న తండ్రి పాండురంగం పోలీసు ఉన్న‌తాధికారుల‌ను కోరాడు. దీంతో ఆయ‌న విన‌తి మేర‌కు కోర్టుకు హాజ‌రయ్యేందుకు మంగ‌ళ‌వారం వ‌ర‌కు స‌మ‌య‌మిచ్చిన‌ట్లు తెలుస్తోంది.

డిసెంబ‌ర్ 31 తెల్ల‌వారుజామున డ్రంకెన్ డ్రైవ్‌లో ప‌ట్టుబ‌డిన ప్ర‌దీప్ ఇటీవ‌ల కౌన్సెలింగ్‌కి హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ప‌ట్టుబ‌డిన త‌ర్వాత అజ్ఞాతంలోకి వెళ్లాడంటూ వ‌చ్చిన వార్త‌ల‌కు స‌మాధానంగా తాను చ‌ట్ట‌రీత్యా న‌డుచుకుంటాన‌ని ఓ వీడియో విడుద‌ల చేసిన ప్ర‌దీప్ కోర్టుకు హాజ‌ర‌వ‌డాన్ని మాత్రం ఏదో ర‌కంగా జాప్యం చేస్తూనే ఉన్నాడు. ఆయ‌న తాగిన మ‌ద్యం 178 పాయింట్లు దాటిన కార‌ణంగా క‌చ్చితంగా జైలు శిక్ష పడుతుంద‌నే ఉద్దేశంతో ఇలా సాకులు చెబుతున్నాడ‌ని మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

  • Loading...

More Telugu News