john abraham: జాన్ అబ్రహాంకు 'నో' చెప్పిన తమన్నా!

  • జాన్ సరసన నటించే అవకాశం
  • వద్దనుకున్న తమన్నా, పూజా
  • డిజాస్టర్ హీరోల జాబితాలో జాన్ ఉండటమే కారణం

బాలీవుడ్ లో పిలిచి అవకాశం ఇస్తామంటుంటే హీరోయిన్లు పూజా హెగ్డే, తమన్నాలు వద్దు పొమ్మంటున్నారు. ఇప్పుడు బీ టౌన్ లో ఇదే హాట్ టాపిక్. వివరాల్లోకి వెళ్తే, కండల వీరుడిగా పేరుగాంచిన జాన్ అబ్రహాం సరసన నటించే అవకాశం వీరిద్దరి తలుపు తట్టింది. మామూలుగా అయితే ఇది బంపర్ ఆఫరే.

కానీ, వీరు మాత్రం వద్దనుకున్నారు. కారణం ఏమిటంటే, ప్రస్తుతం జాన్ పరిస్థితి ఏమీ బాగోలేదు. వరుస ఫ్లాపులతో డిజాస్టర్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో జాన్ సరసన నటిస్తే, మొదటికే మోసం వస్తుందని ఈ భామలు భావిస్తున్నారు. పూజా హెగ్డే వరకైతే ఓకే అనుకోవచ్చు. ఎందుకంటే ఆమె చేతిలో కాస్తో కూస్తో సినిమాలు ఉన్నాయి. కానీ, తమన్నా దాదాపు ఖాళీగానే ఉంది. అయినా, తమన్నా 'నో' చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోందట.

john abraham
Tamannaah
pooja hegde
  • Loading...

More Telugu News