gajal srinivas: జైల్లో ఖైదీలకు గజల్స్ వినిపిస్తున్న గజల్ శ్రీనివాస్!

  • జైల్లో గజల్స్ పాడుతున్న శ్రీనివాస్
  • రెండు రోజుల పాటు భోజనం కూడా చేయలేదు
  • ఇంత వరకు ఆయనను కలవని భార్య, కుమార్తె

లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ గజల్ కళాకారుడు గజల్ శ్రీనివాస్ హైదరాబాదులోని చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. జైల్లో ఉన్న శ్రీనివాస్ అక్కడ కూడా గజల్స్ తోనే సాంత్వన పొందుతున్నారు. జైల్లోని తోటి ఖైదీలకు ఆయన గజల్స్ వినిపిస్తున్నారు. శనివారంనాడు జైల్లో జరిగిన యోగా శిక్షణ శిబిరం ప్రారంభోత్సవంలో గజల్స్ పాడి ఆయన అందరినీ ఆకట్టుకున్నారు.

జైలుకు వచ్చిన తొలి రెండు రోజుల పాటు భోజనం చేయని శ్రీనివాస్... క్రమేణా జైలు భోజనాన్ని తీసుకుంటున్నారు. తన బ్యారక్ లో ఉన్న తోటి ఖైదీలతో ఆయన కలుపుగోలుగా ఉంటున్నారట. మరోవైపు, ఆయన జైలుకు వచ్చినప్పటి నుంచి ఆయనను కలిసేందుకు ఆయన భార్య కానీ, కుమార్తె కానీ ములాఖత్ కు రాలేదట. ఆయన తరపు బంధువులు, లాయర్ మాత్రమే వచ్చి వెళ్లారట.

gajal srinivas
gajal srinivas in jail
  • Loading...

More Telugu News