whatsapp: త్వరలో వాట్సాప్‌లో అందుబాటులోకి రాబోతున్న కొత్త ఫీచర్!
- వాయిస్ కాల్ మాట్లాడుతూనే వీడియో కాల్‌కి మారే అవకాశం
- ప్రస్తుతం బీటా వెర్షన్‌కి మాత్రమే
- స్విచ్ పేరుతో బటన్
ఒక్క బటన్ నొక్కడం ద్వారా వాయిస్ కాల్ నుంచి వీడియో కాల్‌కి మారే అవకాశాన్ని వాట్సాప్ త్వరలో ప్రవేశపెట్టబోతోంది. స్విచ్ పేరుతో అందుబాటులోకి తీసుకురాబోతున్న ఈ బటన్ సాయంతో ఒక వైపు వాయిస్ కాల్ మాట్లాడుతూనే, వీడియో కాల్‌కి మారే అవకాశం లభిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా వాయిస్ కాల్ కట్ చేసి, మళ్లీ వీడియోకాల్ చేయనవసరం లేదు. ప్రస్తుతం ఈ సదుపాయాన్ని బీటా వెర్షన్‌కి మాత్రమే పరిమితం చేశారు. త్వరలో రానున్న అప్‌డేట్ ద్వారా ఈ సదుపాయాన్ని అందరికీ కల్పించనున్నట్లు తెలుస్తోంది.
స్విచ్ బటన్ నొక్కినప్పటికీ అవతలి వ్యక్తి వీడియో కాల్ మాట్లాడటం ఇష్టం లేకపోతే... ఆ రిక్వెస్ట్‌ను తిరస్కరించి వాయిస్ కాల్‌లోనే కొనసాగే అవకాశం కూడా ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్న వాట్సాప్ ఈ మధ్య అనుకోకుండా ఓ ఫీచర్‌ని ఎనేబుల్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఫీచర్ సహాయంతో గ్రూప్‌లో ఎవరికైనా వ్యక్తిగతంగా రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఫీచర్‌ని వాట్సాప్ వెంటనే తొలగించింది. ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ని పూర్తిస్థాయిలో విడుదల చేయలేదు. త్వరలోనే గ్రూప్ ఇండివిడ్యువల్ రిప్లై ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.