Venkatesh: ‘అజ్ఞాతవాసి’లో వెంకటేశ్ ఎక్కడబ్బా?.. ప్రతీ సీన్‌ను గాలిస్తున్న అభిమానులు

  • సినిమా విడుదలకు ముందు వెంకటేశ్ పాత్రపై ప్రచారం
  • టైటిల్స్‌లో వెంకీకి కృతజ్ఞతలు..
  • అయినా కనిపించని వెంకటేశ్
  • సోషల్ మీడియాలో చర్చకు దారితీసిన వైనం

పవన్ ‘అజ్ఞాతవాసి’లో వెంకటేశ్  కోసం ఇటు పవన్, అటు వెంకటేశ్ అభిమానులు సినిమా మొత్తం గాలిస్తున్నారు. ప్రతీ ఫ్రేమ్‌ను వదలకుండా చూస్తున్నారు. అయినా ఆయన కనిపించకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో వెంకటేశ్ మూడు నిమిషాల నిడివిగల పాత్రలో కనిపిస్తాడన్న ప్రచారం జరిగింది.

క్లైమాక్స్‌లో వెంకటేశ్ వస్తాడన్న వార్తలు సినిమా విడుదలకు ముందు హల్ చల్ చేశాయి. ఇక టైటిల్స్‌లో వెంకటేశ్‌కు కృతజ్ఞతలు చెప్పడం ఇందుకు మరింత బలం చేకూర్చింది. దీంతో ఆయన ఎప్పుడు కనిపిస్తాడా? ఎలా కనిపిస్తాడా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే సినిమా ముగిసినా వెంకటేశ్ కనిపించకపోవడంతో నిరాశ చెందారు.

దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వెంకటేశ్ సీన్‌పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సినిమా నిడివి ఎక్కువగా ఉండడం వల్ల వెంకటేశ్ సీన్లను తొలగించారా? లేక, ఇంకేమైనా కారణం ఉందా? అన్న చర్చ జరుగుతోంది. సినిమా యూనిట్ కూడా వెంకటేశ్ సీన్‌పై ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.

Venkatesh
Pawan Kalyan
Agnathavasi
Tollywood
  • Loading...

More Telugu News