Pawan Kalyan: పవన్ కంటే కత్తే అందగాడట!.. కత్తి మహేశ్‌ను పొగిడేసిన వర్మ

  • పవన్‌పై మరోసారి ‘కత్తి’ గట్టిన వర్మ
  • సినిమాపైనా, పవన్‌పైనా వ్యంగ్యంగా ట్వీట్లు
  • ఆర్జీవీ పొగడ్తతో పొంగిపోతున్న కత్తి
  • ‘బాగుంది మీ ఇద్దరి వ్యవహారం’ అంటూ హైపర్ ఆది సెటైర్

సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి విరుచుకుపడ్డాడు. పవన్ తాజా సినిమా ‘అజ్ఞాతవాసి’ అతి పెద్ద డిజాస్టర్ అని పేర్కొన్న ఆర్జీవీ.. పవన్‌పై విరుచుకుపడుతున్న సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘అజ్ఞాతవాసి’కి కత్తి ఇచ్చిన రివ్యూ వీడియోను తాను ఇప్పుడే చూశానని పేర్కొన్న వర్మ.. పవన్ కంటే కత్తి మహేశ్ చాలా అందంగా ఉన్నాడని పేర్కొన్నాడు.

వర్మ తనను పొగడడంతో ఉబ్బితబ్బిబ్బయిన కత్తి ‘థ్యాంక్యూ’ అంటూ రిప్లై ఇచ్చాడు. జబర్దస్త్ ఫేం హైపర్ ఆది మాత్రం వెరైటీగా స్పందించాడు. వీరిద్దరి తీరు చూస్తుంటే ‘ఇదిగో తెల్ల కాకి అంటే.. అదిగో పిల్ల కాకి’ అన్నట్టు ఉందని ఎద్దేవా చేశాడు. కత్తి మహేశ్ పేరు వింటేనే రగిలిపోతున్న పవన్ అభిమానులు ఆర్జీవీ ట్వీట్‌పై మండిపడుతున్నారు. కత్తిని పొగడడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో  కామెంట్ల మీద కామెంట్లు పెడుతూ ఆర్జీవీని ఎండగడుతున్నారు.  

Pawan Kalyan
Kathi Mahesh
Ram Gopal varma
  • Loading...

More Telugu News