Hrithik Roshan: నా జీవితంలో వెలుగు నీవే.. మరింతగా వెలుగును పంచు: హృతిక్ రోషన్ కు మాజీ భార్య విషెస్

  • నేడు హృతిక్ రోషన్ బర్త్ డే
  • జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సుసానే
  • పవిత్ర హృదయమా అంటూ పోస్ట్

బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్ నేడు 44వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ఆయకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాజీ భార్య సుసానే కూడా హృతిక్ కు ఇన్ స్టాగ్రామ్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. 'నా జీవితంలో ఎప్పటికైనా వెలుగువు నీవే. హ్యాపీ హ్యాపీయెస్ట్ బర్త్ డే. నవ్వుతూ ఉండు. అంతులేనంతగా వెలుగును పంచు పవిత్ర హృదయమా' అంటూ పోస్ట్ చేసింది. దీనితో పాటు ఇద్దరూ కలసి ఉన్న ఓ ఫొటోను అప్ లోడ్ చేసింది.

2002లో హృతిక్ రోషన్, సుసానే ఖాన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 2013లో విడిపోయారు. 2014 నవంబర్ లో కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

A post shared by Sussanne Khan (@suzkr) on

Hrithik Roshan
Sussanne Khan
  • Loading...

More Telugu News