governor: ఇరు రాష్ట్రాల ప‌రిస్థితుల‌పై ప్ర‌ధానికి వివరించిన గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌

  • ఢిల్లీలో ప‌ర్య‌టిస్తున్న గ‌వ‌ర్న‌ర్‌
  • తెలంగాణ‌ భూ రికార్డుల ప్ర‌క్షాళ‌న గురించి ప్ర‌స్తావ‌న‌
  • విభ‌జ‌న స‌మ‌స్య పరిష్కారం గురించి వివ‌ర‌ణ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీతో భేటీ అయ్యారు. దాదాపు అర‌గంట‌పాటు ఆయ‌న, ప్ర‌ధానితో చ‌ర్చించారు. ఈ చ‌ర్చ‌లో భాగంగా ఇరు రాష్ట్రాల ప‌రిస్థితుల‌ను ప్ర‌ధానికి వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది.

తెలంగాణకు సంబంధించి వ్య‌వసాయానికి 24గంటల విద్యుత్‌ సరఫరా, భూ రికార్డుల ప్రక్షాళన అంశాలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి సంబంధించి పోల‌వ‌రం, కాళేశ్వరం ప్రాజెక్టు పనుల అంశాల‌ను గ‌వ‌ర్న‌ర్ చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. రెండు రాష్ట్రాల్లోనూ శాంతిభద్రతల పరంగా ఎలాంటి సమస్యలూ లేవని చెబుతూ, ఇటీవల తనను ఓ సందర్భంలో కలిసినప్పుడు విభ‌జ‌న స‌మ‌స్య ప‌రిష్కారానికి ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు సానుకూల‌త వ్య‌క్తం చేసిన విష‌యాన్ని కూడా గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌, ప్ర‌ధానికి వివ‌రించారు.

  • Loading...

More Telugu News