bank app virus: బ్యాంకింగ్ యాప్ లకు వైరస్.. కీలక సూచన చేసిన ఎస్బీఐ!
- బ్యాంకర్ ఏ9480 పేరిట పొంచి ఉన్న ముప్పు
- 'ఎస్బీఐ ఎనీవేర్ పర్సనల్' యాప్ సురక్షితమన్న ఎస్బీఐ
- ఫ్లాష్ ప్లేయర్ ఇన్ స్టాల్ చేసుకోవద్దంటూ సూచన
బ్యాంకింగ్ యాప్ లకు వైరస్ ముప్పు పొంచి ఉందని క్విక్ హీల్ ల్యాబ్ వెల్లడించింది. ఎస్బీఐ సహా 232 బ్యాంకు యాప్ లకు ఆండ్రాయిడ్ బ్యాంకింగ్ ట్రోజన్ పేరిట ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ఫేక్ ఫ్లాష్ ప్లేయర్ యాప్ ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తోందని తెలిపింది. ఆండ్రాయిడ్ బ్యాంకర్ ఏ9480 పేరిట ఉన్న ఈ వైరస్ వినియోగదారుడి లాగిన్ వివరాలు, ఎస్ఎంఎస్ లను హైజాక్ చేస్తోందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఎస్బీఐ యాజమాన్యం తన వినియోగదారులకు కీలక సూచనలు చేసింది. 'ఎస్బీఐ ఎనీవేర్ పర్సనల్' యాప్ సురక్షితమని తెలిపింది. ఫ్లాష్ ప్లేయర్ ను ఇన్ స్టాల్ చేసుకోవద్దని సూచించింది. మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ను అప్ డేట్ చేసుకోవాలని తెలిపింది. మొబైల్ లేదా ఆన్ లైన్ బ్యాంకింగ్ చేసేవారు తమ మొబైల్స్ లో లేదా కంప్యూటర్ లో యాంటీ వేర్ సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలని పేర్కొంది.