Pawan Kalyan: ‘అజ్ఞాతవాసి’కి నేతన్న చిరు కానుక.. సోషల్ మీడియాలో చక్కర్లు!

  • పవన్‌పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్న నేతన్న
  •  ‘అజ్ఞాతవాసి’ స్టిల్స్‌తో చీర రూపొందించిన వైనం
  • సోషల్ మీడియాలో వైరల్

ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు పవన్ మేనియాతో ఊగిపోతున్నాయి. గత వారం, పది రోజులుగా ఎక్కడ చూసినా  ‘అజ్ఞాతవాసి’గా వస్తున్న పవన్ కల్యాణ్ గురించే చర్చ. మరో వ్యాపకం లేనట్టు ఏ ఇద్దరు కలిసినా ముచ్చట దానిమీదే. పవన్‌కు ఉన్న క్రేజ్‌కు ఇది నిదర్శనం. మరోవైపు పవన్ అభిమానులు-కత్తి మహేశ్‌కు జరుగుతున్న  యుద్ధం.. దీంతో నిత్యం అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ, ఇటు సామాజిక మాధ్యమాల్లోనూ పవన్ లేకుండా ఉండడం లేదు.
 
కాగా, పవన్‌పై తనకున్న అభిమానాన్ని ఓ చేనేత కార్మికుడు వినూత్నంగా ప్రదర్శించి పవన్‌పై తనకున్న ఆరాధనా భావాన్ని ప్రదర్శించాడు. ఫ్లెక్సీలు, పాలాభిషేకాలకు బదులుగా ‘అజ్ఞాతవాసి’ సినిమా స్టిల్స్‌తో ఏకంగా ఓ చీరను రూపొందించాడు. దీనిని సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. కామెంట్లు, షేర్లతో సోషల్  మీడియాను ఊపేస్తోంది. కాగా, ఈ చీరను ఎవరు రూపొందించారు? కార్మికుడి పేరు ఏమిటి? వంటి వివరాలు తెలియరాలేదు. 

  • Loading...

More Telugu News