Pawan Kalyan: తొలి ఆట పడకుండానే అమెరికాలో దుమ్మురేపుతున్న ‘అజ్ఞాతవాసి’.. అడ్వాన్స్ బుకింగుల్లో రికార్డు!

  • ఓవర్సీస్‌లోనూ పవన్ అభిమానుల సందడి
  • అడ్వాన్స్ బుకింగుల్లో అమెరికాలో రికార్డు
  • సినిమా సూపర్ అంటున్న అభిమానులు

అమెరికాలో ‘అజ్ఞాతవాసి’ థియేటర్లకు రాకుండానే రికార్డులు సృష్టిస్తున్నాడు. తొలి ఆట కూడా పడకుండానే అడ్వాన్స్ బుకింగుల్లో రికార్డు నమోదైంది. థియేటర్ల ఎదుట పవన్ అభిమానులు బారులు తీరారు. ‘అజ్ఞాతవాసి’ మేనియాతో ఊగిపోతున్నారు. సంక్రాంతి కానుకగా పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాకు అభిమానులు నీరాజనాలు పడుతున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో పవన్ అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ‘అజ్ఞాతవాసి’ రిలీజ్‌తో వారు ముందే సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. థియేటర్లు, రోడ్లపైన ఎక్కడ చూసినా పవన్ అభిమానులే కనిపిస్తున్నారు. సినిమా చూసి వచ్చిన వారు పవన్‌ను పొగిడేస్తున్నారు. ‘సూపర్’ అంటూ కొనియాడుతున్నారు. పవన్ కెరియర్‌లో ఇదో బ్లాక్ బస్టర్‌గా నిలిచిపోతుందని అంటున్నారు.

Pawan Kalyan
Tollywood
America
Andhra Pradesh
agnathavasi
  • Loading...

More Telugu News