anushka: 4 మిలియన్ల వ్యూస్ ను రాబట్టేసిన 'భాగమతి'

  • 'భాగమతి'గా అనుష్క 
  • ఆసక్తిని రేపుతోన్న అనుష్క లుక్ 
  • జనవరి 26వ తేదీన విడుదల

అనుష్క ప్రధాన పాత్రధారిగా .. అశోక్ దర్శకత్వంలో 'భాగమతి' చిత్రం రూపొందింది. భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మించారు. నిన్న మధ్యాహ్నం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అనుష్క డిఫరెంట్ లుక్స్ తో కనిపించడం .. ఆ రెండు పాత్రల నేపథ్యాన్ని సస్పెన్స్ లో పెట్టడం అందరిలో ఆసక్తిని పెంచుతోంది.

 'భాగమతి' గెటప్ లో అనుష్క కనిపించిన తీరు .. ఆమె డైలాగ్ డెలివరీ మరింతగా కుతూహలాన్ని కలిగిస్తున్నాయి. పాడుబడిన బంగ్లా చుట్టూ అల్లుకున్న కథేమిటనేది ఉత్కంఠగా మారింది. ఈ ట్రైలర్ ను విడుదల చేసిన 24 గంటలలోపే 3 మిలియన్ల వ్యూస్ రాగా, ప్రస్తుతం ఈ ట్రైలర్ 4 మిలియన్ల వ్యూస్ ను క్రాస్ చేసింది. ఈ స్థాయిలో ఈ ట్రైలర్ దూసుకుపోతుండటం, ఈ సినిమా పట్ల జనంలో గల ఆసక్తికి అద్దం పడుతోంది. జనవరి 26వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.      

  • Loading...

More Telugu News