gram: గ్రామ్ పేరుతో క్రిప్టోకరెన్సీని ఆవిష్కరించబోతున్న టెలిగ్రామ్ యాప్
- టెలిగ్రామ్ ఓపెన్ నెట్వర్క్ ద్వారా లావాదేవీలు
- వర్చువల్ కరెన్సీ ద్వారానే చెల్లింపులు
- 180 మిలియన్ల యూజర్లకు కొత్త సదుపాయం
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ త్వరలో క్రిప్టోకరెన్సీని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. గ్రామ్ పేరుతో ఈ వర్చువల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు టెలిగ్రామ్ సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురేవ్ తెలిపారు. దేశీయ చెల్లింపులు, అంతర్జాతీయ చెల్లింపులు, బ్లాక్ చైన్ మారకం, ట్రేడింగ్ వంటి నాలుగు రకాల సేవలను ఈ క్రిప్టోకరెన్సీ ద్వారా కల్పించనున్నారు.
వాట్సాప్ తర్వాత అత్యంత ఎక్కువ మంది వాడుతున్న టెలిగ్రాం యాప్, ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తే ప్రపంచవ్యాప్తంగా 180 మిలియన్ల మంది వినియోగదారులు వర్చువల్ మార్కెట్ పరిధిలోకి వచ్చే సదుపాయం కలుగుతుంది. గ్రామ్ని త్వరలో ఆవిష్కరించేందుకు టెలిగ్రాం సన్నాహాలు చేస్తోంది. ఫోన్ కాంటాక్టు నెంబర్ల ద్వారా ఈ కరెన్సీ చెల్లింపులు జరగనున్నాయి.