actress sanjana: కత్తి మహేష్ ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేసిన హీరోయిన్ సంజన!

  • గౌరవం కలిగినవారిని కించపరుస్తూ గొప్పవారు కావాలనుకుంటారు కొందరు
  • కత్తి మహేష్ పై సంజన పరోక్ష వ్యాఖ్యలు
  • 'పవన్ సార్, మీకు అండగా ఉన్నా'మంటూ ట్వీట్

వపర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ ల మధ్య కొనసాగుతున్న సోషల్ మీడియా వార్ వేడిని పుట్టిస్తోంది. నీవు ఒకటి అంటే... నేను రెండు అంటా అనే విధంగా పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో, కత్తి మహేష్ కు వ్యతిరేకంగా టాలీవుడ్ ప్రముఖులు కొందరు తమ గళం విప్పుతున్నారు. తాజాగా హీరోయిన్ పూనం కౌర్ కత్తికి వ్యతిరేకంగా ట్వీట్ చేసి... అనవసరంగా వివాదంలో చిక్కుకుంది.

ఈ క్రమంలో ఇప్పుడు మరో హీరోయిన్ సంజన పవన్ కు మద్దతుగా ట్వీట్ చేసింది. పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవడం కోసం కొంత మంది మంచి మార్గాలను వెతుక్కుంటారని, కష్టపడి పని చేస్తారని చెప్పింది. మరికొందరేమో గౌరవంగా, సక్సెస్ ఫుల్ గా ఉన్న వ్యక్తులను కించపరుస్తూ పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటారని అంది. 'పవర్ సర్... మేమంతా మీతోనే ఉన్నాం' అంటూ ట్వీట్ చేసింది.

actress sanjana
sanja comments on kathi mahesh
Kathi Mahesh
Pawan Kalyan
tollywood
  • Loading...

More Telugu News