Social Media: కత్తి మహేష్ వేసిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఇచ్చిన పవన్ ఫ్యాన్స్!

  • రెండు రోజుల క్రితం పూనం కౌర్ కు కత్తి ప్రశ్నలు
  • ఆమె వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసిన కత్తి
  • సమాధానాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్

నటి పూనం కౌర్ వ్య‌క్తిగ‌త జీవితాన్ని టార్గెట్ చేస్తూ, రెండు రోజుల క్రితం సినీ విశ్లేషకుడు క‌త్తి మ‌హేష్ కొన్ని ప్రశ్నలను సంధించిన తరువాత, వాటికి సమాధానాలను పవన్ ఫ్యాన్స్ ప్రిపేర్ చేశారు. కత్తి ప్రశ్నలకు సమాధానాలను సోషల్ మీడియా మాధ్యమంగా ప్రచారం చేస్తున్నారు. ఇక ఆ సమాధానాల్లో ఉన్న వివరాల ప్రకారం, జల్సా సినిమా సమయంలో కమలినీ ముఖర్జీ క్యారెక్టర్ కోసం తొలుత పూనంను అనుకున్నారట. అప్పుడు సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన పూజల్లో పూనం పాల్గొంది. అవేమీ క్షుద్ర పూజలు కాదు.

 ఆ తరువాత పవన్ పక్కన పూనం నప్పదని భావించిన త్రివిక్రమ్ కమలినీ ముఖర్జీని సెలక్ట్ చేసుకున్నాడు. సినీ ఫీల్డ్ లో ఇవన్నీ సర్వసాధారణం. అయితే, ఓ పెద్ద సినిమా నుంచి తనను తొలగించడంతో కెరీర్ దెబ్బతిందన్న మనస్తాపంతో, డిప్రెషన్ లోకి వెళ్లిన పూనం ఆత్మహత్యాయత్నం చేసింది. జరిగిన దాంట్లో తన తప్పేమీ లేకున్నా, తాను కూడా ఎంతో కొంత కారణమన్న ఆలోచనతోనే పవన్ కల్యాణ్, ఆమెను పరామర్శించి ఆసుపత్రి బిల్లు చెల్లించారు. ఇది ఆయన మంచితనం.

ఆపై ఆమె తల్లిని కలిసి, పూనం తన కెరీర్ ను తిరిగి గాడిలో పెట్టుకునేందుకు సహకరిస్తానని మాటిచ్చారు. అది తప్పా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత ప్రచారకర్త కోసం వెతుకుతూ, ఎవరిని తీసుకోవాలన్న ఆలోచనలో ఉంటే, పూనం పేరును పవన్ సూచించి ఉండవచ్చు. ఇందులో తప్పేంటి? అంటూ ఓ మెసేజ్ ను పవన్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు.

Social Media
Pawan Kalyan
Kathi Mahesh
fans
Poonam Kaur
  • Loading...

More Telugu News