old monk rum: 'ఓల్డ్ మాంక్' రమ్ సృష్టికర్త కపిల్ మోహన్ మృతి!
- జనవరి 6న మరణించిన కపిల్
- 1954 డిసెంబర్ 19న ఓల్డ్ మాంక్ రమ్ ఆవిష్కరణ
- పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిన ప్రభుత్వం
ప్రపంచంలో బెస్ట్ సెల్లింగ్ రమ్‌గా నిలిచిన ఓల్డ్ మాంక్ సృష్టికర్త కపిల్ మోహన్ ఈ నెల 6న గుండెపోటుతో మరణించారు. ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘజియాబాద్‌లో మోహన్ నగర్‌లోని తన ఇంట్లో ఆయన మరణించారు. మోహన్ మేకిన్ లిమిటెడ్ పేరుతో ఓల్డ్ మాంక్ రమ్ సంస్థను ఆయన నెలకొల్పారు.
స్వతహాగా ఎలాంటి మద్యం తీసుకోని కపిల్ మోహన్, ఓల్డ్ మాంక్‌తో పాటు సోలా నెం.1, గోల్డెన్ ఈగల్ వంటి మరో రెండు బ్రాండులను కూడా ఆయన సృష్టించారు. 1954, డిసెంబర్ 19న ఓల్డ్ మాంక్ రమ్‌ను కపిల్ మోహన్ ఆవిష్కరించారు. ఈయన కృషికి గాను పద్మశ్రీ అవార్డునిచ్చి ప్రభుత్వం సత్కరించింది.