Agnatavasi: 'అజ్ఞాతవాసి'కి తెలంగాణ పోలీసుల షాక్.. ప్రీమియర్ షోలకు నో పర్మిషన్!

  • ప్రీమియర్ షోలకు అనుమతి లేదు
  • తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉన్నాయి
  • అర్థరాత్రి తరువాతి షోలకు అనుమతి నిరాకరణ

'అజ్ఞాతవాసి' చిత్రానికి తెలంగాణ పోలీసు అధికారులు షాకిచ్చారు. ఈ చిత్రం ప్రీమియర్ షోలను ప్రదర్శించుకునేందుకు అనుమతి కావాలని నిర్మాతలు అడుగగా, పోలీసు ఉన్నతాధికారులు నిరాకరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్థరాత్రి తరువాత ప్రీమియర్ షోలు వేసుకునేందుకు అనుమతించేది లేదని తేల్చి చెప్పారు.

 ప్రీమియర్ లకు అనుమతి ఇస్తే, అభిమానుల మధ్య తొక్కిసలాటలు జరిగే అవకాశాలు ఉన్నాయని, గతంలో ఇటువంటి ఘటనలను చూశామని, అన్ని థియేటర్ల వద్దా బందోబస్తు సాధ్యం కాదని అభిప్రాయపడ్డ ఉన్నతాధికారులు, ప్రీమియర్ లకు ఓకే చెప్పేది లేదని నిర్మాతలకు సమాచారం ఇచ్చారు.

 కాగా, ఏపీ సర్కారు రోజుకు ఏడు ఆటలను ప్రదర్శించుకునేలా వారం రోజుల పాటు పవన్ కల్యాణ్ చిత్రానికి ప్రత్యేక అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల కేసీఆర్ ను స్వయంగా కలిసిన పవన్, ప్రత్యేక షోలకు అనుమతి కోరినట్టు కూడా వార్తలు వచ్చాయి.

Agnatavasi
Pawan Kalyan
Telangana
Police
Andhra Pradesh
  • Loading...

More Telugu News