kona venkat: 'సత్య' సినిమాలో 'కల్లు మామ' పాటతో రైటర్ గా మారాను: కోన వెంకట్

  • 'సత్య' సినిమా కోసం పాట రాశాను 
  • వర్మకి ఆ పాట రాసిన తీరు నచ్చింది 
  • మాటలు కూడా నన్నే రాయమన్నారు 
  • రైటర్ అవుతానని అనుకోలేదు 

కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు అందించడంలో కోన వెంకట్ తనదైన ముద్ర వేశారు. ఆయన రచయితగా పనిచేసిన ఎన్నో సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. అలాంటి కోన వెంకట్ తన కెరియర్ ను గురించిన విషయాలను ఐ డ్రీమ్స్ తో పంచుకున్నారు.

 " నేను ఘోస్ట్ రైటర్ గా ఎవరి దగ్గర పనిచేయలేదు .. అంత అవసరమూ రాలేదు. రామ్ గోపాల్ వర్మతో వున్న పరిచయం కారణంగా 'సత్య' సినిమా కోసం 'మామ .. కల్లు మామా' అనే పాట రాశాను. ఆ సినిమాలో గ్యాంగ్ స్టర్స్ పాడుకునే పాట అది. అది రాసిన తరువాత .. 'నువ్ డైలాగ్స్ ఎందుకు రాయకూడదు? ఈ సినిమాకి రాసేయి' అన్నారు. అప్పటి వరకూ రైటర్ అవుదామనే ఆలోచన కూడా నాకు లేదు .. కానీ వర్మ ఇచ్చిన ప్రోత్సాహంతో రాసేశాను. అలా రైటర్ గా నా కెరియర్ 'సత్య' సినిమాతో మొదలైంది" అంటూ చెప్పుకొచ్చారు

  • Loading...

More Telugu News