Kathi Mahesh: 'కొడకా...' పేరడీపై స్పందించిన కత్తి మహేష్... పవన్ ఫ్యాన్స్ దుర్మార్గులని నిప్పులు!

  • పవన్ ఫ్యాన్స్ పై విరుచుకుపడ్డ కత్తి మహేష్
  • 15 వరకూ మాట్లాడవద్దని అనుకున్నా
  • కానీ వారు మాత్రం వదలడం లేదన్న కత్తి

తనను తిడుతూ, కొడతామని బెదిరిస్తూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గా చెప్పుకుంటున్న వారు ఓ స్పూఫ్ సాంగ్ ను విడుదల చేసిన నేపథ్యంలో కత్తి మహేష్ స్పందించాడు. ఈ ఉదయం ఓ టీవీ చానల్ తో మాట్లాడిన ఆయన పవన్ ఫ్యాన్స్ పై విరుచుకుపడ్డాడు. ఈ నెల 15 వరకూ ఏమీ మాట్లాడవద్దని వారిలో వారే అనుకుని ఇలా చేయడం ఏంటని ప్రశ్నించారు. తాను కూడా సైలెంట్ గా ఉందామని అనుకుంటే ఉండనివ్వడం లేదని ఆరోపించాడు.

కోన వెంకట్ మీద గౌరవంతో తాను ఏమీ మాట్లాడవద్దని అనుకున్నానని, తనపై ఇప్పుడు జరుగుతున్న దాడికి ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? అని ప్రశ్నించాడు. పవన్ ఫ్యాన్స్ దుర్మార్గులని, తన హక్కులపై దాడి చేయవద్దని వేడుకుంటున్నా వినడం లేదని అన్నాడు.

క్యాన్సర్ తో మరణించిన తన తల్లిని కూడా వాళ్లు వదిలి పెట్టడం లేదని చెప్పాడు. పోలీసు కేసు పెట్టాలని అనుకుంటే ఎన్ని లక్షల మందిపై కేసు పెట్టాలని ప్రశ్నించాడు. పవన్ కల్యాణ్ స్పందించి తన అభిమానులను కట్టడి చేయాలన్నదే తన కోరికని చెప్పుకొచ్చాడు. ఆయన ఒక్క మాట చెబితే సమస్య పరిష్కారమవుతుందని అన్నాడు.

Kathi Mahesh
Pawan Kalyan
spoof song
Pawan Kalyan fans
  • Loading...

More Telugu News