Pawan Kalyan: 'అజ్ఞాతవాసి'కి స్వాగతం చెబుతూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్లెక్సీలు!

  • రేపు విడుదల కానున్న 'అజ్ఞాతవాసి'
  • స్వాగతం పలుకుతూ ప్లెక్సీలు కట్టిన ఎన్టీఆర్ అభిమానులు
  • మాచర్లలోని రామా టాకీస్ ముందు ప్లెక్సీలు

రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'అజ్ఞాతవాసి'కి స్వాగతం పలుకుతూ, అభినందనలు చెబుతూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా మాచర్లలోని రామా టాకీస్ లో 'అజ్ఞాతవాసి' విడుదలవుతుండగా, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ ఫోటోలతో కూడిన ప్లెక్సీని ఏర్పాటు చేసి, దానిపై 'ఆల్ ది బెస్ట్ టూ పవన్ కల్యాణ్... ఫ్రమ్ టౌన్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్' అంటూ రాశారు. ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు ఇలా ఆదర్శవంతమైన ప్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని పలువురు అభినందించారు. ఇటీవల ఎన్టీఆర్ కొత్త చిత్రం ప్రారంభోత్సవానికి పవన్ హాజరై శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.

Pawan Kalyan
Agnatavasi
NTR
Macherla
Rama Talkies
  • Loading...

More Telugu News