Andhra Pradesh: కిడ్నీ రాకెట్ కేసులో కొనసాగుతున్న విచారణ.. హాజరైన టీడీపీ నేత

  • విచారణకు హాజరైన కపిలవాయి విజయ్‌కుమార్
  • వేదాంత ఆసుపత్రి హస్తంపై విచారణ
  • ఆసుపత్రి ఎండీకి విజయ్‌కుమార్ మామ

ఏపీలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో టీడీపీ నేత కపిలవాయి విజయ్‌కుమార్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. కిడ్నీ రాకెట్ వ్యవహారంలో వేదాంత ఆసుపత్రి హస్తం ఉందన్న ఆరోపణలు ఉండడంతో పోలీసులు ఆ కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. వేదాంత ఆసుపత్రి ఎండీకి విజయ్‌కుమార్ మామ కావడంతో పోలీసులు ఆయనను విచారణకు పిలిచారు.

గుంటూరు, నరసరావుపేట కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా పెద్ద ఎత్తున సాగుతున్న కిడ్నీ దందా ఇటీవల వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించింది. ఈ ముఠాలో గుంటూరుకు చెందిన ఓ వైద్యుడే కీలక సభ్యుడన్న ఆరోపణలు వచ్చాయి. మూడు కిడ్నీలు కొనుగోలు చేసిన తర్వాత నాలుగో కిడ్నీ కొనుగోలు సమయంలో తేడా రావడంతో రాకెట్ విషయం వెలుగుచూసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నీ సూత్రధారులు పరారీలో ఉన్నట్టు సమాచారం. కాగా, కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు వేదాంత ఆసుపత్రిలోనే జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆసుపత్రి  హస్తంపై కూపీ లాగుతున్నారు.

Andhra Pradesh
Kidney
Rocket
Telugudesam
  • Error fetching data: Network response was not ok

More Telugu News