agnatavasi: ఓ చిన్నారి తన ప్రోగ్రెస్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నట్టుగా వుంది నా పని!: నటి కుష్బూ

  • దాదాపు పదేళ్ల తర్వాత తెలుగు వెండితెరపై కనపడబోతున్నా
  • త్రివిక్రమ్ పై నాకు ఉన్న నమ్మకం వమ్ము కాదు
  • పవన్ కల్యాణ్ కు అన్నివిధాలా ధన్యవాదాలు: కుష్బూ ట్వీట్

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన చిత్రం ‘అజ్ఞాతవాసి’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్రను నటి కుష్బూ పోషించారు. ఈ సందర్భంగా కుష్బూ ఓ ట్వీట్ చేశారు. ‘ఈ నెల 10న ‘అజ్ఞాతవాసి’ విడుదల కానుంది. ఆ సినిమా విడుదల కానుండటంతో నాలో కలుగుతున్న భావన ఎలా ఉందంటే .. ఓ చిన్నారి మొట్టమొదటిసారి తన ప్రోగ్రెస్ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నట్టుగా అనిపిస్తోంది ... దాదాపు పదేళ్ల తర్వాత తెలుగు వెండితెరపై కనపడనున్నాను. నా ఎదురుచూపులు విలువైనవని భావిస్తున్నా. త్రివిక్రమ్ పై నాకు ఉన్న నమ్మకం వమ్ము కాదనేది నా విశ్వాసం. పవన్ కల్యాణ్ కు అన్నివిధాలా ధన్యవాదాలు చెబుతున్నా’ అని తన ట్వీట్ లో కుష్బూ పేర్కొన్నారు. 

agnatavasi
Pawan Kalyan
  • Error fetching data: Network response was not ok

More Telugu News