video: తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారి.. నచ్చచెప్పి పంపిన పోలీసులు.. వీడియో వైరల్!

  • ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో ఘటన
  • తనను ఎగ్జిబిషన్‌కు తీసుకెళ్లడం లేదని ఫిర్యాదు 
  • తన తల్లిదండ్రులను అరెస్ట్‌ చేయాలని కోరిన వైనం

పదకొండేళ్ల ఓ బాలుడు తన తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇటావాకు చెందిన నారాయణ్ గుప్తా ఐదో తరగతి చదువుతున్నాడు. తనను ఎగ్జిబిషన్‌కు తీసుకెళ్లాలని కొన్ని రోజులుగా తల్లిదండ్రులను అడుగుతున్నాడు. అయితే, ఆ బాలుడి సరదాను తల్లిదండ్రులు తీర్చడం లేదు.

దీంతో విసుగెత్తిపోయిన ఆ బాలుడు పోలీస్ట్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు విషయాన్ని తెలిపి, తన తల్లిదండ్రులను అరెస్ట్‌ చేయాలని కోరాడు. ఆ బాలుడు ఫిర్యాదు చేస్తుండగా తీసిన వీడియోను పోలీసులు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆ పిల్లాడికి నచ్చచెప్పి, అతడి తండ్రిని పిలిచి ఆ బాలుడిని ఇంటికి పంపామని తెలిపారు.

  • Loading...

More Telugu News