India: బంగ్లాదేశ్ లో తయారవుతున్న వేల కోట్ల భారత నకిలీ కరెన్సీ... సంచలన వీడియో ఇది!

  • బంగ్లాదేశ్ లోని ఓ ప్రెస్ లో నోట్ల ముద్రణ
  • అచ్చం అసలు నోట్ల మాదిరే నకిలీ కరెన్సీ
  • ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ఉద్దేశం

బంగ్లాదేశ్ లోని ఓ ప్రింటింగ్ ప్రెస్ అది. ఎక్కడుందో తెలియదుగానీ, అక్కడ ఏమి ముద్రిస్తారన్న విషయాన్ని తెలుసుకుంటే, ప్రతి భారతీయుడూ ఆందోళన చెందాల్సిందే. భారత నకిలీ కరెన్సీని అక్కడ ముద్రిస్తున్నారు. రెండు వేలు, ఐదు వందలు నుంచి 50 రూపాయల నోట్ల వరకూ అక్కడ గుద్దేస్తున్నారు. అవి కూడా అచ్చం ఒరిజినల్ మాదిరిగానే కనిపిస్తున్నాయి.

 కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన కరెన్సీని సరిహద్దులు దాటించి, భారత్ లో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే వాటిని ప్రింట్ చేస్తున్న వారి ఉద్దేశమని వేరే చెప్పనక్కర్లేదుగా. ఈ వీడియోను ఎవరు తీశారో, ఎవరు తొలుత సోషల్ మీడియాలో పోస్టు చేశారన్న సమాచారం లేదుగానీ, ఇదిప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూడండి.

India
Currency
Face Currency
Bangladesh
  • Error fetching data: Network response was not ok

More Telugu News