raj tarun: 'రంగుల రాట్నం' ముందుకు .. 'రాజుగాడు' వెనక్కు!

  • జనవరిలో 'రంగుల రాట్నం' రిలీజ్ 
  • ఫిబ్రవరిలో 'రాజుగాడు' విడుదల 
  • రెండు సినిమాలు మహిళా దర్శకులతోనే       

సుంకర రామబ్రహ్మం నిర్మాణంలో .. సంజనా రెడ్డి దర్శకత్వంలో రాజ్ తరుణ్ 'రాజుగాడు' సినిమా చేశాడు. అమైరా దస్తూర్ కథానాయికగా నటించిన ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. అయితే అన్నపూర్ణ బ్యానర్ పై రాజ్ తరుణ్ చేసిన 'రంగుల రాట్నం' సినిమాను సంక్రాంతి బరిలోకి దింపాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో 'రాజుగాడు' సినిమా వెనక్కి వెళ్లింది. దీంతో ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

 'రంగుల రాట్నం' సినిమాలో రాజ్ తరుణ్ .. మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపించనున్నాడు. గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసే ఓ సంస్థలో ఆయన పనిచేస్తూ ఉంటాడట. శ్రీరంజని దర్శకురాలిగా పరిచయం కానున్న ఈ సినిమా ద్వారా, చిత్రా శుక్లా కథానాయికగా పరిచయం అవుతోంది. ఈ సినిమాతో రాజ్ తరుణ్ కి మరో హిట్ పడుతుందేమో చూడాలి మరి.   

  • Error fetching data: Network response was not ok

More Telugu News