West Godavari: పవన్ కల్యాణ్ మా దేవుడండీ.. ఆయన్ని ఏమైనా అంటే ఊరుకోను!: సెల్ టవర్ దిగొచ్చిన తరువాత వీరాభిమాని జ్యోతి కృష్ణ

  • కోట్లాది మందికి ఆయన ఆరాధ్య దైవం
  • పవన్ పై మాత్రమే ఎందుకు విమర్శలు
  • ఏమైనా అంటే చూస్తూ ఊరుకోబోను
  • హెచ్చరించిన జ్యోతి కృష్ణ

పవన్ కల్యాణ్ తనకు, తనతో పాటు కోట్లాది మందికి దేవుడి వంటి వాడని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలో నిన్న సెల్ టవర్ ఎక్కి, ఆత్మహత్య చేసుకుంటానని హల్ చల్ చేసిన జ్యోతి కృష్ణ వ్యాఖ్యానించాడు. ఆదివారం నాడు కత్తి మహేష్ మీడియా మీట్, ఆపై టీవీ చానల్స్ లో ఆయన ఇంటర్వ్యూలు చూసి, మనస్తాపం చెందిన జ్యోతి కృష్ణ సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకోబోతున్నానని హెచ్చరించిన సంగతి తెలిసిందే.

 అతన్ని కిందకు దించేందుకు పోలీసులు, బంధు మిత్రులు నానా తంటాలూ పడాల్సి వచ్చింది. చాలా సేపు నచ్చజెప్పిన తరువాత టవర్ దిగి వచ్చిన జ్యోతి కృష్ణ మీడియాతో మాట్లాడుతూ, తాను పవన్ కల్యాణ్ కు భక్తుడివంటి వాడినని, ఇదే కత్తి మహేష్ పవన్ పై మాత్రమే ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నాడని ప్రశ్నించాడు. సమాజంలో జరిగే దేన్నీ ఆయన విమర్శించడని, తమ అభిమాన హీరోనే అంటున్నాడని, పవన్ ను ఏమైనా అంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించాడు.

West Godavari
Pawan Kalyan
Fans
Jyothi Krishna
  • Error fetching data: Network response was not ok

More Telugu News