up cm: యోగి సర్, మీరు మా రాష్ట్రం నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది!: సిద్ధరామయ్య ట్వీట్

  • కర్ణాటకను చూసి నేర్చుకోవాలని హితవు
  • యూపీలో ఆకలి చావులకు చెక్ పేట్టేందుకు ఏం చేయాలో తెలుస్తుందని ట్వీట్
  • దానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రీట్వీట్

త్వరలో జరగనున్న కర్ణాటక రాష్ట్ర విధానసభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి గాను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్రానికి విచ్చేశారు. ఆయనకు సీఎం సిద్ధరామయ్య స్వాగతం పలుకుతూ తమను చూసి ఎంతో నేర్చుకోవాల్సింది ఉందంటూ ట్వీట్ చేశారు. ఇక్కడ ఉన్న సమయంలో ఇందిరా క్యాంటీన్, ఓ రేషన్ షాపును సందర్శించాలని ఆదిత్యనాథ్ కు సూచించారు. ‘‘మీ రాష్ట్రంలో కొన్ని సందర్భాల్లో చోటు చేసుకున్న ఆకలి చావుల సమస్యను పరిష్కరించడానికి ఇది తోడ్పడుతుంది’’ అని సిద్ధరామయ్య తన ట్వీట్ లో పేర్కొన్నారు.

twitter courtesyదీనికి సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా తగిన విధంగానే ట్వీటిచ్చారు. ‘‘నాకు స్వాగతం పలికినందుకు ధన్యవాదాలు సిద్ధరామయ్యజీ. మీ పాలనలో కర్ణాటకలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయని విన్నాను. యూపీ ముఖ్యమంత్రిగా నేను మీ భాగస్వామ్య పక్షాలు నెలకొల్పిన దుర్భర పరిస్థితులను తొలగించడానికి ప్రయత్నిస్తున్నాను’’ అంటూ యోగి ట్వీట్ చేశారు.

up cm
karnataka cm
yogi adityanath
siddharamaiah
twitter
  • Loading...

More Telugu News