eesha guptha: తమ్ముడితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసిన బాలీవుడ్ నటి... బాయ్‌ఫ్రెండ్ అనుకొని నెటిజన్ల కామెంట్లు!

  • గ‌ట్టిగా స‌మాధానం చెప్పిన న‌టి ఈషా గుప్తా
  • చ‌దువురాని ద‌ద్ద‌మ్మ‌ల‌ని కామెంట్ చేసిన న‌టి
  • 'బేబీ బాయ్‌' అని పిల‌వ‌డం వ‌ల్ల త‌లెత్తిన స‌మ‌స్య‌

త‌మ వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను అభిమానుల‌తో పంచుకోవ‌డానికి సెలెబ్రిటీలు సోష‌ల్ మీడియాను ఉప‌యోగిస్తుంటారు. కానీ కామెంట్ చేసే వారిలో అభిమానుల‌తో పాటు ద్వేషించేవారు కూడా ఉంటారు. కొన్ని ఫొటోల‌కు సెలెబ్రిటీలు రాసే పోస్టును వీరు త‌ప్పుగా అర్థంచేసుకుని ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా కామెంట్లు చేస్తారు.

ఇటీవ‌ల బాలీవుడ్ న‌టి ఈషా గుప్తా చేసిన పోస్టుకు కూడా ఇలాంటి స‌మ‌స్యే ఎదురైంది. త‌న సోద‌రుడితో క‌లిసి దిగిన ఫొటోను ఈషా గుప్తా షేర్ చేసింది. ఆ ఫొటోలో 18 ఏళ్ల యువ‌కుడు ఈషా నుదుటి మీద ముద్దు పెడుతుండ‌టం, ఆమె అత‌న్ని `బేబీ బాయ్‌` అని సంబోధించ‌డంతో నెటిజ‌న్లు త‌ప్పుగా అర్థం చేసుకున్నారు.

32 ఏళ్ల ఈషా, 18 ఏళ్ల యువ‌కుడితో డేటింగ్ చేస్తోంది... బాయ్‌ఫ్రెండ్ బాగున్నాడు... అంటూ కామెంట్లు చేశారు. ఈ కామెంట్ల‌పై ఈషా తీవ్రంగా స్పందించింది. కామెంట్ చేసిన వారంద‌రినీ చ‌దువురాని ద‌ద్ద‌మ్మ‌లుగా పేర్కొంటూ మ‌రో పోస్ట్ చేసింది. ఫొటోలో ఉన్న‌ది బాయ్‌ఫ్రెండ్ కాద‌ని స్ప‌ష్ట‌త ఇచ్చింది.

  • Loading...

More Telugu News