nagarjuna: మల్టీ స్టారర్ మూవీలో డాన్ గా నాగ్ .. డాక్టర్ గా నాని

  • శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మల్టీ స్టారర్ 
  • నిర్మాతగా అశ్వనీదత్  
  • మాఫియా డాన్ గా నాగార్జున 
  • డాక్టర్ పాత్రలో నాని      

'భలే మంచిరోజు' .. 'శమంతకమణి' సినిమాలతో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన ఒక మల్టీ స్టారర్ ను ప్లాన్ చేశాడు. ఈ సినిమాలో నాగార్జున .. నాని ప్రధానమైన పాత్రలను పోషించనున్నారు. ఈ ఇద్దరూ పోషించే పాత్రలు ఏమిటనే ఆసక్తి అభిమానుల్లో వుంది.

ఈ సినిమాలో నాగార్జున మాఫియా డాన్ గా .. నాని డాక్టర్ గా కనిపించనున్నారనేది తాజా సమాచారం. ఈ రెండు పాత్రల మధ్య వున్న సంబంధం .. వాళ్లమధ్య చోటుచేసుకునే సన్నివేశాలు ఆసక్తిని కలిగించే విధంగా వుంటాయని అంటున్నారు. ఈ రెండు పాత్రల మధ్య కావలసినంత కామెడీ ఉంటుందని చెబుతున్నారు. అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరించే ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇటు నాగ్ అభిమానులు .. అటు నాని ఫ్యాన్స్ ఈ సినిమా మొదలయ్యే సమయం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.       

  • Loading...

More Telugu News