Saina Nehwal: బ్యాడ్మింటన్ సరిగా ఆడలేకపోతున్న హీరోయిన్ శ్రద్ధా కపూర్... ఆగిన సైనా బయోపిక్!

  • బ్యాడ్మింటన్ నేర్చుకోవడంలో శ్రమిస్తున్న శ్రద్ధ
  • పరిపూర్ణత సాధించలేదని భావించిన అమోల్ గుప్తే
  • శ్రద్ధ స్థానంలో దీపికను తీసుకోవాలన్న ఆలోచన

'ఓకే జాను', 'హసీనా పార్కర్' వంటి పెద్ద చిత్రాల్లో నటించినా, మంచి హిట్ సాధించలేకపోయిన శ్రద్ధా కపూర్, మంచి చాన్స్ లనే దక్కించుకుంది. ఓ వైపు ప్రభాస్ హీరోగా రూపుదిద్దుకుంటున్న 'సాహో'లో నటిస్తూ, మరోవైపు ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ బయోపిక్ కూ సైన్ చేసిందన్న సంగతి తెలిసిందే.

అయితే, బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, సైనా బయోపిక్ ను దర్శకుడు అమోల్ గుప్తే ఆపేశాడట. సైనా, గోపీచంద్ ల సమక్షంలో శ్రద్ధా కపూర్, శ్రద్ధగా బ్యాడ్మింటన్ నేర్చుకుంటున్నప్పటికీ, ఆటలో పరిపూర్ణతను మాత్రం కనబరచడం లేదట. సైనా కొట్టేలా షాట్లను కొట్టడంలో విఫలం అవుతోందట. దీంతో ఆ సినిమాను ఆపేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో వైరల్ అవుతున్న మరో న్యూస్ ఏంటంటే, శ్రద్ధ స్థానంలో బ్యాడ్మింటన్ తెలిసున్న దీపికా పదుకొనేను తీసుకోవాలని అమోల్ ఆలోచిస్తున్నాడట. ఇక వీటిల్లో ఏది నిజమన్న సంగతి చిత్ర యూనిట్ ప్రకటిస్తేనే తెలుస్తుంది.

Saina Nehwal
Sradhdha Kapoor
Biopic
Amool Gupte
  • Loading...

More Telugu News