Lakshmi Parvati: మానవ రూపంలోని నారదుడు... దారి తప్పిన మేధావి: వర్మపై లక్ష్మీపార్వతి లేటెస్ట్ కామెంట్!

  • ఓ వెబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన లక్ష్మీపార్వతి
  • నారదుడు వర్మ రూపంలో పుట్టాడేమో
  • వివాదాలకు పుట్టిల్లు రాంగోపాల్ వర్మ
  • ఆయన తన తెలివిని మంచికి వాడాలని సలహా

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పై హీరో బాలకృష్ణ తీయనున్న బయోపిక్, వర్మ తలపెట్టిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాలపై ఆయన భార్య లక్ష్మీ పార్వతి స్పందించారు. బాలకృష్ణ ప్రయత్నాన్ని అభినందించిన ఆమె, తన భర్త జీవితంలోని విజయ గాథలను మాత్రమే చూపిస్తానని బాలయ్య చెప్పారని, ఆయన జీవితం మొత్తాన్ని సినిమాగా చూపించాలని తానేమీ కోరుకోవడం లేదని అన్నారు.

ఇక రాంగోపాల్ వర్మ పేరు చెబితేనే వివాదాలని, నారదుడు బహుశా ఈ జన్మలో వర్మ రూపంలో పుట్టుండవచ్చని వ్యాఖ్యానించారు. వివాదాలకు పుట్టిల్లైన వ్యక్తి సినిమాతీస్తే, వివాదాలు రాకుండా మరేం ఉంటాయని అన్నారు. దెయ్యాల సినిమాలు తీసి జనాలను భయపెట్టిన ఆయన, సమాజానికి మెసేజ్ ఇచ్చేలా ఒక్క సినిమా కూడా తీయలేదని ఆరోపించారు. డ్రగ్స్ కేసులో విచారణకు చార్మీని పిలిపిస్తే, ఆమెను ఝాన్సీ లక్ష్మీబాయితో పోల్చడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చూస్తుంటే, ఆయన దారి తప్పిన మేధావని తనకు అర్థమైందని, ఆయన తన తెలివిని మంచికి వినియోగిస్తే బాగుండేదని అన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News