Tamilnadu: 70 టన్నుల పాత రూ. 500, రూ. 1000 నోట్లు... ఎలా మారిపోతున్నాయో చూడండి!

  • ప్యాడ్ లుగా మారుతున్న పాత కరెన్సీ
  • తమిళనాడు పుళల్ జైలుకు చేరిన 70 టన్నుల పాత నోట్లు
  • రోజుకు 1000 ప్యాడ్లు తయారు చేస్తున్న ఖైదీలు

రద్దయిన పాత కరెన్సీ ఇప్పుడు ప్యాడ్ లుగా మారుతోంది. మొత్తం 70 టన్నుల పాత నోట్లు తమిళనాడులోని పుళల్ జైలుకు చేరగా, ఫైల్ ప్యాడ్ల తయారీలో శిక్షణ పొందిన ఖైదీలు వీటిని తయారు చేస్తున్నారు. ఇప్పటివరకూ 9 టన్నుల పాత కరెన్సీతో ప్యాడ్లు తయారు చేసినట్టు తమిళనాడు జైళ్ల శాఖ డీఐజీ ఎ.మురుగేశన్‌ తెలిపారు.

నవంబర్ 2016లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన తరువాత, బ్యాంకులకు వచ్చిన కరెన్సీని దగ్ధం చేస్తారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ, పర్యావరణానికి హాని కలుగుతుందన్న ఆలోచనతో ఆ కార్యక్రమానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. ఇక ఈ నోట్లతో ప్యాడ్స్ తయారు చేయాలని నిర్ణయించగా, ప్రస్తుతం రోజుకు 1000 ప్యాడ్లు తయారవుతున్నాయి. తొలుత కరెన్సీ నోట్లను గుజ్జుగా మార్చి, ఆపై దాన్ని గట్టిపరిచి ప్యాడ్లుగా తయారు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News