Nirmala Sitharaman: త్యాగరాజస్వామి కీర్తన మధ్యలో వాణిజ్య ప్రకటన... దూరదర్శన్‌పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం!

  • పంచరత్న కీర్తనల మధ్యలో బ్రేక్
  • కాసేపు కూడా ఆగలేరా? అంటూ అసహనంతో ట్వీట్
  • స్పందించిన ప్రసార భారతి
  • పొరపాటు జరిగిందని వివరణ

దూరదర్శన్‌పై రక్షణశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అసహనాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపి దూరదర్శన్‌కు అక్షింతలు వేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. తమిళనాడులోని తిరువయ్యూరులో జరుగుతున్న త్యాగరాజ ఆరాధనోత్సవాలను శనివారం డీడీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. పంచరత్న కీర్తనలను మంత్రి ఎంతో ఆసక్తిగా టీవీలో వీక్షిస్తూ.. మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నారంటూ ట్విట్టర్ ద్వారా డీడీని అభినందించారు. అయితే అంతలోనే ప్రసారాన్ని నిలిపివేసి ప్రకటనలు వేసింది. ఇష్టంగా చూస్తున్న పంచరత్న కీర్తలనలకు మధ్యలో బ్రేక్ రావడంతో మంత్రి సీతారామన్ ఒకింత అసహనానికి గురయ్యారు.

ట్విట్టర్ ద్వారా దూరదర్శన్‌కు తన అసహనాన్ని తెలియజేశారు. దూరదర్శన్‌ను ట్యాగ్ చేస్తూ ‘యో డీడీ  నేషనల్ ఏంటిది? కీర్తన పూర్తయ్యే వరకు ఆగలేరా? కీర్తన మధ్యలో ఈ ప్రకటనలేంటి?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ట్వీట్‌కు స్పందించిన ప్రసారభారతి సీఈవో ఎస్ఎస్ వేంపాటి వివరణ ఇస్తూ.. ఇది అనుకోకుండా జరిగిన పొరపాటని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు.

Nirmala Sitharaman
Doordarshan
Minister
  • Loading...

More Telugu News