Kathi Mahesh: వివాదం ఆగాలంటే అదొక్కటే దారి.. కత్తి మహేశ్ సంచలన వ్యాఖ్యలు!

  • పవన్ నేరుగా దిగొస్తే తప్ప నా యుద్ధానికి ముగింపు లేదు
  • ఆయనేం చేస్తాడో నాకు తెలియదు
  • అభిమానులను కంట్రోల్‌లో పెట్టాల్సిందే..
  • పరిష్కారాన్ని తెరపైకి తెచ్చిన కత్తి మహేశ్

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌పై కత్తి కట్టిన కత్తి మహేశ్ తన పోరాటాన్ని ఆపాలంటే ఏం చేయాలో చెప్పుకొచ్చాడు. ఓ టీవీ లైవ్ షోలో పాల్గొన్న కత్తి.. మాట్లాడుతూ తన యుద్ధం ఆగాలంటే.. పవన్ నేరుగా దిగిరావడం తప్ప మరో మార్గం లేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన కోపం అంతా పవన్ అభిమానుల ఉన్మాద చర్యలపైనేనని, టీవీ చానళ్ల చుట్టూ తిరుగుతున్నది అందుకోసమేనని పేర్కొన్నాడు. తన మధ్యలోకి వచ్చే పవన్ భజనపరులను కూడా పరిగణనలోకి తీసుకుంటానని పేర్కొన్న కత్తి.. వివాదానికి పరిష్కారం పవన్ చేతుల్లోనే ఉందని తేల్చి చెప్పాడు. ఆయన దిగిరాక తప్పదని కుండ బద్దలుగొట్టాడు.  

పవన్ కల్యాణ్ అనేవాడు దిగివచ్చి అభిమానులను నియంత్రించుకోక తప్పదని, తనకు ఫోన్ రాకుండా ఉన్నప్పుడే తన పోరాటానికి ముగింపు అని వివరించాడు. అది కూడా ఒక నిర్ణీత సమయంలోనే జరగాలని పేర్కొన్నాడు. మధ్యలో ఎవరైనా వేలు పెట్టేందుకు ప్రయత్నిస్తే వివాదం మరింత ముదురుతుందని హెచ్చరించాడు. పవన్ తన అభిమానులను కంట్రోల్‌లో పెట్టే వరకు తానైతే తగ్గే ప్రసక్తే లేదని కత్తి మహేశ్ తేల్చి చెప్పాడు.

Kathi Mahesh
Pawan Kalyan
Tollywood
  • Loading...

More Telugu News