Kona venkat: కత్తి మహేశ్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్: రంగంలోకి కోన వెంకట్...15 వరకు అందరూ మౌనంగా ఉండాలని పిలుపు

  • పవన్-కత్తి వివాదానికి చెక్ చెప్పేందుకు ముందుకొచ్చిన కోన వెంకట్
  • మౌనంగా ఉండాలని అందరికీ  పిలుపు
  • ఆయన ఏం చేయబోతున్నారంటూ సర్వత్ర ఉత్కంఠ

సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న గొడవలోకి ప్రముఖ సినీ రచయిత, నిర్మాత, దర్శకుడు కోన వెంకట్ ఎంటరయ్యారు. ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని నిర్ణయించుకున్న ఆయన పవన్ వైపు నుంచి ఏదో ఒకటి చేసి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నారు.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పవన్ అభిమానులకు ఓ సూచన చేశారు. ఈ నెల 15వ తేదీ వరకు అందరూ మౌనంగా ఉండాలని, మౌనం ఎప్పటికీ మోసం చేయదని పేర్కొన్నారు. పవన్ అభిమానులతోపాటు, కత్తి మహేశ్ కూడా మౌనంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

మీడియా హౌస్‌లకు వెళ్లి పవన్ అభిమానుల గురించి, పవన్ వ్యక్తిగత జీవితం గురించి వ్యతిరేక ప్రసంగాలు ఇవ్వవద్దని కత్తిని కోరారు. అలా చేసినట్టయితే ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలనుకుంటున్న తన ప్రయత్నం విఫలమవుతుందన్నారు.

కోన వెంకట్ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది. 15వ తేదీన ఆయన ఏం చేయబోతున్నారన్న చర్చ మొదలైంది. ఆ రోజున పవనే నేరుగా రంగంలోకి దిగుతారా? వెంకట్ ద్వారా ఏదైనా సందేశం పంపించనున్నారా? అన్న ఆసక్తి నెలకొంది. నెటిజన్లు మాత్రం ఇప్పటి వరకు జరిగింది చాలని, ఇప్పటికైనా ఈ వివాదానికి చెక్ పడితే బాగుంటుందని అంటున్నారు.

Kona venkat
Tollywood
Pawan Kalyan
Kathi Mahesh
  • Error fetching data: Network response was not ok

More Telugu News