Cricket: మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ ని అడ్డుకున్న హెచ్ సీఏ సిబ్బంది.. మండిపడ్డ వీహెచ్!

  • ఈరోజు నిర్వహించిన హెచ్ సీఏ సమావేశం
  • ‘ఇదేమైనా టీఆర్ఎస్ మీటింగ్ అనుకుంటున్నావా?’
  • మండిపడుతూ..మైక్ విరిచేసిన వీహెచ్

లోథా కమిటీ ఆదేశాల అమలుపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) ఈరోజు సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లిన మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ ని హెచ్ సీఏ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్) మండిపడ్డారు.

‘ఇదేమైనా టీఆర్ఎస్ మీటింగ్ అనుకుంటున్నావా?’ అంటూ టీఆర్ఎస్ నేత, హెచ్ సీఏ ప్రెసిడెంట్ వివేక్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో మైక్ ను నేలకేసి కొట్టారు. కాగా, వివేక్ స్పందిస్తూ, లోథా కమిటీ ఆదేశాల అమలు కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశామని, మీటింగ్ లో ఇంతకుముందు అమలైన 16 అంశాలపై చర్చ జరిగిందని అన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ)కు అజారుద్దీన్ మద్దతు ఇస్తున్నారని తెలిసిందని, అందుకే, ఆయన్ని ఈ సమావేశానికి అనుమతించలేదని స్పష్టం చేశారు. అజహరుద్దీన్ పై తమకు చాలా గౌరవం ఉందని, హెచ్ సీఏ లో నిధులు లేవని, అండర్ -14 నిర్వహించేందుకు కూడా నిధులు లేకపోతే ఇతరుల దగ్గర నుంచి తీసుకువచ్చి నిర్వహించామని అన్నారు.

  • Loading...

More Telugu News