Agnata vasi: ‘అజ్ఞాతవాసి’ విడుదలైన రోజే చూస్తా..రివ్యూ ఇస్తా: కత్తి మహేశ్

  • ‘అజ్ఞాతవాసి’ ట్రైలర్ బాగుంది
  • పవన్ ఫ్యాన్స్ నన్ను చాలా మానసికంగా హింసించారు
  • పవన్ తన అభిమానులను కంట్రోల్ చేయలేకపోతున్నారు
  • ఓ ఇంటర్వ్యూలో కత్తి మహేశ్

‘అజ్ఞాతవాసి’ విడుదలైన రోజే ఈ సినిమా చూస్తానని, రివ్యూ ఇస్తానని ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుందని చెప్పారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అభిమానులు తనపై చేసిన ఆరోపణల గురించి ప్రస్తావిస్తూ, తనను ఫ్యాన్స్ చాలా మానసికంగా హింసించారని, కొన్నాళ్లుగా తనపై మానసిక దాడి చేస్తున్నారని విమర్శించారు.

పవన్ తన అభిమానులను కంట్రోల్ చేయలేకపోతున్నారని విమర్శించారు. పవన్ కంట్రోల్ చేస్తారని మూడు, నాలుగు నెలలుగా ఎదురుచూశానని ఆయన స్పందించలేదని, తన ఫ్యాన్స్ కు ఆయన చెప్పలేదని అన్నారు. తాను మాట్లాడిన మాటల్లో, అడిగిన ప్రశ్నల్లో ఏమాత్రం తప్పు ఉన్నా, ఈపాటికే తనను అరెస్టు చేసి, జైలుకు పంపించే వాళ్లని అన్నారు. తనకు చట్టం, జర్నలిజం గురించి తెలుసని, అందుకే తాను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానని చెప్పారు.

Agnata vasi
Kathi Mahesh
  • Loading...

More Telugu News