Kathi Mahesh: ఒకే గోత్ర నామాలతో తిరుమల శ్రీవారి సన్నిధిలో పవన్, పూనం కౌర్ పూజలు!: సంచలన ఆరోపణ చేసిన కత్తి మహేష్

  • పూనం కౌర్ ముందు కత్తి మహేష్ ప్రశ్నలు
  • పవన్ మోసం చేస్తేనే పూనం ఆత్మహత్యాయత్నం చేసిందా?
  • అప్పట్లో ఆసుపత్రి చికిత్సకు కూడా ఆయనే డబ్బు పెట్టాడా?
  • కత్తి మహేష్ సంచలన ఆరోపణలు

తాను నటి పూనం కౌర్ ను ఏ విధంగానూ ఇబ్బంది పెట్టాలని భావించడం లేదని, అయితే, ఆమె ముందు తాను కొన్ని ప్రశ్నలను ఉంచాలని అనుకుంటున్నానని చెప్పిన కత్తి మహేష్, పవన్ కల్యాణ్ ను విమర్శిస్తే, ఆమెకు కోపం ఎందుకు వస్తోందన్న విషయమై తన వాదనను వినిపించాడు.

 మీకు బ్రాండ్ అంబాసిడర్ పదవి ఎవరి వల్ల వచ్చింది? తిరుమలలో పవన్ కల్యాణ్ తో పాటు దేవుడి ముందు నిలబడి, ఒకే గోత్ర నామాలతో ఎందుకు పూజ చేయించుకున్నారో చెప్పగలరా? పవన్ మోసం చేశాడన్న భావనతో మీరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే, మిమ్మల్ని కాపాడింది ఎవరు? మీకు అప్పుడు హాస్పిటల్ లో చికిత్సకు ఎంత ఖర్చయింది? ఆ బిల్స్ కట్టిందెవరు?

 పవన్ కల్యాణ్ మీ అమ్మను కలిసి ఏం ప్రామిస్ చేశారు? అది నెరవేర్చారా? లేదా? డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే మీకు ఎందుకంత కోపం? ఓ క్షుద్రమాంత్రికుడితో కలసి త్రివిక్రమ్ పూజలు చేస్తుంటే, అక్కడ మీరు ఏం చేశారు? ఈ ప్రశ్నలకు పూనం సమాధానం చెప్పాలని కత్తి మహేష్ డిమాండ్ చేశారు. తాను సంధించిన ప్రశ్నలకు సంబంధించి అన్ని ఆధారాలూ తన వద్ద ఉన్నాయని చెప్పారు.

Kathi Mahesh
Punam Kaur
Sucide attempt
Tirumala
Pawan Kalyan
  • Loading...

More Telugu News