vishnu: 'ఆచారి అమెరికా యాత్ర' టీజర్ రిలీజ్ రేపే

  • విష్ణు హీరోగా 'ఆచారి అమెరికా యాత్ర'
  • టీజర్ రిలీజ్ కి సన్నాహాలు 
  • జనవరి 26న సినిమా విడుదల

మంచు విష్ణు మొదటి నుంచి కూడా యాక్షన్ కామెడీ కథలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. ఈ తరహా సినిమాలు ఆయనకి మంచి సక్సెస్ లను ఇచ్చాయి కూడా. దాంతో ఆయన మళ్లీ అదే మార్క్ యాక్షన్ కామెడీతో 'ఆచారి అమెరికా యాత్ర' సినిమా చేశాడు. జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి, రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఫస్టు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ .. స్పెషల్ పోస్టర్ ను వదిలారు. ఆద్యంతం వినోదభరితంగా కొనసాగుతూ గిలిగింతలు పెట్టే ఈ సినిమాలో కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ నటించింది. ఇక కీలకమైన పాత్రలో బ్రహ్మానందం సందడి చేయనున్నాడు. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, ఈ నెల 26వ తేదీన విడుదల చేయనున్నారు. గతంలో జి. నాగేశ్వర్ రెడ్డితో రెండు హిట్లు అందుకున్న విష్ణు, ఈ సినిమాతో మూడో హిట్ ను సొంతం చేసుకుంటాడేమో చూడాలి.       

  • Loading...

More Telugu News