Salman Khan: పెళ్లి చేసుకోవద్దు.. కానీ, తండ్రి అవ్వు!: సల్మాన్ కు రాణి ముఖర్జీ సలహా

  • బిగ్ బాస్ లో సల్లూకు సలహా ఇచ్చిన రాణి
  • 'హిచ్కి' ప్రమోషన్ లో రాణీముఖర్జీ
  • బాలీవుడ్ లో పెరుగుతున్న సరోగసీ జననాలు

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు అతని స్నేహితురాలు, నటి రాణి ముఖర్జీ ఆసక్తికరమైన సలహా ఇచ్చింది. పెళ్లి చేసుకోరాదని, ఇదే సమయంలో తండ్రి కావాలని చెప్పింది. తన కుమార్తె అదిరాకు సల్మాన్ బిడ్డ మంచి ఫ్రెండ్ అవుతుందని తెలిపింది. తన తాజా సినిమా 'హిచ్కి' ప్రమోషన్ కోసం సల్మాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్-11కు రాణి వచ్చింది. ఈ సందర్భంగా సల్లూకు ఈ సలహా ఇచ్చింది. యశ్ రాజ్ ఫిల్మ్ అధినేత ఆదిత్య చోప్రాను రాణి పెళ్లాడిన సంగతి తెలిసిందే.

సల్మాన్ బేబీ ఆయనలాగే అందంగా ఉంటుందని ఈ సందర్భంగా రాణి తెలిపింది. ఒకవేళ తనలా కాకుండా, తల్లిలా అందంగా లేకుండా పుడితే పరిస్థితి ఏంటని ఈ సందర్భంగా సల్మాన్ ప్రశ్నించగా... అక్కడ నవ్వులు విరబూశాయి. బాలీవుడ్ లో పెళ్లి చేసుకోకుండానే తల్లిదండ్రులవుతున్న వారి సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే.

నటి సుష్మితాసేన్ ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుంది. తుషార్ కపూర్, కరణ్ జొహార్ లు ఐవీఎఫ్ మరియు సరోగసీ విధానం ద్వారా తండ్రులు అయ్యారు. ఇదే మాదిరే సల్మాన్ ను కూడా తండ్రి కావాలంటూ రాణి సలహా ఇచ్చింది. సల్మాన్, రాణి ముఖర్జీలు 'బాబుల్', 'హలో బ్రదర్', 'చోరీ చోరీ చుప్కే చుప్కే', 'కహీ ప్యార్ నా హోజాయే', 'హర్ దిల్ జో ప్యార్ కరేగా' తదితర చిత్రాల్లో కలసి నటించారు. 

Salman Khan
rani mukherjee
bollywood
big boss
  • Loading...

More Telugu News