Balakrishna: బాలయ్య 'జైసింహా' సినిమాపై సెన్సార్ టాక్ ఇదే!

  • అదిరిపోయే రీతిలో యాక్షన్ సీన్స్
  • మాస్ డైలాగ్స్ కు కొదవలేదు
  • మనసును తాకే సెంటిమెంట్ సీన్లు

వరుస సినిమాలతో బాలకృష్ణ దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన నటించిన 'జైసింహా' సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. కేయస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించారు. బాలయ్యకు జోడీగా నయనతార, హరిప్రియ నటించారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ టాక్ బయటకు వచ్చింది. సినిమాలో మాస్ డైలాగ్స్ కు కొదవ లేదట. యాక్షన్ సీన్స్ అదిరిపోతున్నాయట. బాలయ్య, నయనతారల మధ్య సెంటిమెంట్ సీన్లు, క్లైమాక్స్ మనసును టచ్ చేసేలా ఉన్నాయట. చిరంతన్ భట్ మ్యూజిక్, థీమ్ సాంగ్ అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఆకట్టుకునేలా ఉన్నాయట. సి.కల్యాణ్ చెప్పినట్టు ఓ పాటలో బాలయ్య డ్యాన్స్ అదిపోయిందట.

Balakrishna
jaisimha movie
nayanatara
tollywood
  • Loading...

More Telugu News