note ban: నోట్ల రద్దు కారణంగా తగ్గిన తిరుమల తిరుపతి దేవస్థాన హుండీ ఆదాయం
- దాదాపు రూ. 50 కోట్లు తగ్గిన హుండీ ఆదాయం
- పెరిగిన ఆన్‌లైన్ డొనేషన్లు
- వెల్లడించిన టీటీడీ
2017లో హుండీ ఆదాయ వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఇందులో భాగంగా 2016 కంటే 2017 హుండీ ఆదాయం తగ్గిందని తెలిపింది. మోదీ ప్రభుత్వం అమలు చేసిన నోట్ల రద్దు కారణంగా ఈ తగ్గుదల కనిపించినట్లు తెలుస్తోంది. ఏకమొత్తంగా రూ. 995.89 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది. ఇది 2016 ఆదాయం రూ. 1046.28 కోట్లతో పోల్చితే దాదాపు రూ. 50 కోట్లు తక్కువ.
మరోవైపు ఆన్‌లైన్ డొనేషన్లు పెరిగినట్లు టీటీడీ ప్రకటించింది. 2016లో ఆన్‌లైన్ ఆదాయం రూ. 10.53 కోట్లు కాగా, 2017లో రూ. 15.36 కోట్లు వచ్చిందని టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఎస్వీబీసీ ఛానల్ నిర్వహించిన `డయల్ యువర్ ఈఓ` కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ విషయాలు వెల్లడించారు. అలాగే గతేడాది 2.73 కోట్ల మంది భక్తులు వచ్చారని, దాదాపు 1,87,000ల కేజీల తలనీలాలు ఇచ్చారని, వాటిని అమ్మగా రూ. 6.39 కోట్ల ఆదాయం వచ్చిందని ఆయన చెప్పారు.