Pawan Kalyan: ఒకరికి సలాం కొట్టి, మరొకరికి గులాంగిరి చేసి.. పవన్ కల్యాణ్ సాధించుకుంది ఇదే!: కత్తి మహేష్

  • 'అజ్ఞాతవాసి' ప్రీమియర్లను విచ్చలవిడిగా వేసుకోవచ్చు
  • టికెట్ రేట్లను కూడా పెంచుకోవచ్చు
  • జనాల డబ్బును దోచుకునేందుకు ప్లాన్ రెడీ అయింది

తెలుగు రాష్ట్రాల్లో 'అజ్ఞాతవాసి' సినిమా ప్రీమియర్లను విచ్చలవిడిగా వేసుకోవచ్చంటూ ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ అన్నారు. టికెట్ రేట్లను కూడా కావాల్సినంత పెంచుకోవచ్చని చెప్పారు. ఎక్స్ ట్రా షోలకు కూడా అబ్జెక్షన్ లేదని అన్నారు. ప్రజల డబ్బును ఘరానాగా దోచుకునేందుకు పక్కా ప్లాన్ రెడీ అయిందని చెప్పారు.

'ఒకరికి సలాం కొట్టి, మరొకరికి గులాంగిరి చేసి పవన్ కల్యాణ్ సాధించుకున్న హక్కులు ఇవి' అని ఎద్దేవా చేశారు. కానీ, పాపం త్రివిక్రమ్ శ్రీనివాసే ఈ సినిమాను కాపీ కొట్టి... పవన్ ను ఇబ్బందులపాలు చేశారని చెప్పుకుంటున్నారని అన్నారు. టీసిరీస్ వేసిన కేసుతో... కనీసం ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయలేక, కోర్టుతో సినిమాకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలియక చిత్ర నిర్మాత సతమతమవుతున్నాడని చెప్పారు. ఇది చాలా బాధాకరమైన వార్తే అయినప్పటికీ... అప్పుడప్పుడు బాధ కూడా మంచిదే అవుతుందని అన్నారు.

Pawan Kalyan
Kathi Mahesh
tollywood
trivikram srinivas
agnathavasi
  • Loading...

More Telugu News