Women: మహిళలూ.. గర్భనిరోధక సాధనాలతో జర భద్రం!
- గర్భ నిరోధక సాధనాలతో హెచ్ఐవీ ముప్పు
- రోగ నిరోధక వ్యవస్థను దెబ్బ తీసే డీఎంపీఏ
- హెచ్చరిస్తున్న పరిశోధకులు
గర్భనిరోధక సాధనాలు ఉపయోగించే మహిళలు జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వీటిని ఉపయోగించడం వల్ల మహిళల్లో హెచ్ఐవీ సోకే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. సబ్ సహారా ఆఫ్రికా ప్రాంతంలోని మహిళలు ‘డిపాట్-మెడ్రాక్సీప్రొజెస్టిరాన్ అసిటేట్ (డీఎంపీఏ)ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. గర్భాన్ని నిరోధించేందుకు ఇంజెక్షన్ రూపంలో మూడు నెలలకోసారి దీనిని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఔషధాన్ని వినియోగించే మహిళల్లో హెచ్ఐవీ ముప్పు 40 శాతం పెరిగినట్టు అధ్యయనంలో వెల్లడైంది.
డీఎంపీఏ రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుందని, జననాంగం వద్ద రక్షణగా ఉండే పొరను ప్రభావరహితంగా మారుస్తుందని, ఫలితంగా హెచ్ఐవీ సోకే ముప్పు ఏర్పడుతుందని అధ్యయనకారులు తెలిపారు. కాబట్టి డీఎంపీఏకు బదులుగా మరోటి వాడడం ఉత్తమమని సూచించారు.