jio: హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ లు ప్రకటించిన జియో !

  • న్యూఇయర్ కానుకగా ప్రకటన
  • పాత ప్లాన్ లపై  రూ.60 తగ్గింపు
  • కొత్త ప్లాన్ లపై 50% డేటా అదనం

టెలికాం రంగంలో భిన్నమైన ఆఫర్ లు ప్రకటిస్తూ మార్కెట్ లో రాకెట్ లా దూసుకుపోతున్న జియో.. తన కస్టమర్లకు న్యూఇయర్ కానుక ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న కొన్ని ప్లాన్లపై రూ.60 మేర తగ్గించిన జియో మిగతా ప్లాన్లపై అదనపు డేటాను ప్రకటించింది. అలాగే రోజుకి 1జీబీ డేటా వాడుకునే వినియోగదారులకు 1.5 జీబీ డేటా ఉపయోగించుకునేలా వెసులుబాటు కల్పించింది.

రూ.199, రూ.399, రూ.459, రూ.499 ప్లాన్‌లపై రూ.60లు తగ్గించింది. దీంతో పాటు నూతన సంవత్సరం ఆఫర్‌ కింద రూ.198, రూ.398 రూ.448, రూ.498 ప్లాన్లపై అదనంగా 50 శాతం డేటాను అందిస్తోంది.

jio
jio new year offer
  • Loading...

More Telugu News