Telangana: నేడు, రేపు శీతల గాలులు.. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిక
- తెలంగాణలో విజృంభిస్తున్న చలి
- పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
- శీతల గాలుల నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు
ఆదిలాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శని, ఆదివారాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శీతల గాలుల నుంచి తప్పించుకునేందుకు అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. శుక్రవారం ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో పలుచోట్ల అతి శీతల గాలులు వీచాయి.
మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఖమ్మం, భద్రాచలంలో సాధారణం కంటే 7 డిగ్రీలు తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఆదిలాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రత 6 డిగ్రీలుగా నమోదైంది. మెదక్, రామగుండంలో 3 డిగ్రీలు, హకీంపేట, హన్మకొండ, హైదరాబాద్, నల్లగొండలో 2 డిగ్రీల వరకు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.